దౌల్తాబాద్ మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

" జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్, ఏప్రిల్ 6: దౌల్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ దేశాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *