నా కుమారు ఇంటిలోంచి వెళ్ళగొట్టాడు … నా ఇల్లు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి .. తల్లి ఆవేదన.. పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు..

పయనించే సూర్యుడు ఏప్రియల్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం మూడవ ఏపీఎస్పీ బాలాజీ నగర్ కు చెందిన సరేళ్ల పుష్పవతి కుమార్తెలు సరేళ్ల జ్యోతిలు మీడియాతో మాట్లాడుతూ నా భర్త పోలీస్ గా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు నిర్మాణం చేసుకున్నామని అయితే నా కుమారుడు సరేళ్ళ నవీన్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడని నా ఇంటిని నమ్మించి కాగితాలు రాయించుకుని నన్ను ఇంటి నుండి బయటికి వెలగొట్టాడని ఇదేమిటి అనిప్రశ్నిస్తే నా కుమారుడు నా కోడలు నన్ను ఇబ్బందులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నా కుమార్తె జ్యోతి పదో తరగతి నుంచి ఎంబీఏ వరకు చదివిన సర్టిఫికెట్లను చింపేశారని మీడియాకు వారు తెలియజేసారు. పోలీస్ కానిస్టేబుల్ గా పలుకుబడి ఉన్న నా కొడుకుకి పోలీస్ స్టేషన్కు వెళ్దాం న్యాయం జరగట్లేదని సిఐ కూడా నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో గల పిజిఆర్ఎస్లో తల్లి ఇద్దరు కుమార్తెలు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.