పయనించే సూర్యుడు) 7/4/26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండల రిపోర్టర్ హన్మంతు కొడంగల్ మున్సిపాలిటీలోని శాంతినగర్ కాలనీ లో బిచ్చపు ఎంకమ్మ మరణించడం జరిగింది. 70 బిచ్చపు ఎంకమ్మ కుమారుడు చెత్త కాగితాలు చెత్త కుప్పలపై ఏరుకొని జీవనం సాగిస్తుండేవారు. పూటకు కూడా నోచుకోని నిరుపేద కుటుంబం కావడంతో బిచ్చపు ఎంకమ్మ కూతుర్లు కుమారులు ఉన్నా కూడా దహన సంస్కారాలు చేయడానికి స్తోమత లేని స్థితిలో ఉన్నారు. అలాంటి నిరుపేద కుటుంబాలకు అండగా నేనున్నానంటూ వచ్చిన వార్డ్ నెంబర్ 6 అయినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ హమీద్ అలాగే అమ్మానాన్న ఫౌండేషన్ అయినటువంటి ప్రవీణ్ హమీద్ చివరి దాకా ఉండి. ఆ నిరుపేద కుటుంబాన్ని అండగా నిలిచి అంతక్రియలు జరిపించారు.