నెల్లూరులో ఫీనిక్స్ హాస్పిటల్ మరో విజయకథ

రెండేళ్ల బాలునికి జీబీస్ అరుదైన వ్యాధికి విజయవంతమైన చికిత్స

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ 7 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండలం మంచాలపల్లి జంగాల కాలనీకి చెందిన పోలయ్య–మహేశ్వరి దంపతుల రెండేళ్ల బాలుడు శశికుమార్ అరుదైన నరాల వ్యాధితో బాధపడుతూ నెల్లూరులోని బృందావనంలో ఉన్న ఫీనిక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరాడు.వైద్యులు పరీక్షలు నిర్వహించగా బాలుడు జీబీస్ (గిలియన్-బారే సిండ్రోమ్) అనే అత్యంత అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధిలో శరీర రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం వల్ల చేతులు, కాళ్లలో బలహీనత, నడవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి.ఈ నేపథ్యంలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్. గోకుల కృష్ణన్, వెన్నుపూస వైద్య నిపుణురాలు డాక్టర్ ఏ. వైష్ణవి ఆధ్వర్యంలో బాలుడికి ప్రత్యేక చికిత్స అందించారు. సమయానికి గుర్తించి సరైన వైద్యం అందించడంతో బాలుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.బాలుడి తల్లిదండ్రులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.