నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడిగు జాడల్లో నడవాలి – ఏపూరి

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 7 ,తల్లాడ రిపోర్టర్ ఈరోజు తల్లాడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ భారత ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన రాజకీయ దురంధరుడు, 40 సం|| ల సుదీర్ఘకాలం పార్లమెంట్లో సభ్యుడిగా దేశ ప్రజలకు విశేషమైన సేవలు అందించిన యోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరటం జరిగింది. దళితులలో ఈ దేశానికి ఉప ప్రధాని ఐన వ్యక్తి, ఈ దేశ తొలి కార్మిక శాఖ మంత్రి, భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రి గా దేశానికి విజయం, ఆహార కోరుత సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి గా దళితులలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన నాయకులు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఉద్యమ పోరాట అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఇశ్నేపల్లి అశోక్ మాదిగ, అధ్యక్షులు ఎక్కిరాల నాగేశ్వరరావు, ఆదూరి రవి, నాగేశ్వరరావు, నాగరాజు, బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు