పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటు అయ్యింది. ఈ కార్యక్రమం పలాస సీతమ్మ తల్లి గుడి లో గల వీరబ్రహ్మం గుడి ప్రాంగణంలో ఈ ఎన్నిక నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యవర్గంలో అధ్యక్షులుగా బి దాసు, ఉపాధ్యక్షులుగా జగన్నాథం, ప్రధాన కార్యదర్శి గా ఎల్ మహేష్, సహాయ కార్యదర్శి గా శంకర్రావు, ట్రెజరర్ గా మురళి ఎన్నికయ్యారు. వీరితోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులాను ఎన్నుకున్నారు. ఈ సంఘానికి ముఖ్య సలహాదారులుగా చిత్రాడ రఘు రామ్ జి, షణ్ముఖ, నల్ల బాటి ఎంపిక అయ్యారు. నూతనంగా ఎన్నికైన వారంతా పలాస విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు మేమున్నామనే భరోసా కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో పలాస విశ్వబ్రాహ్మణులు అంత పాల్గొన్నారు.