పాపిరెడ్డి కాలనీ ఆటో యూనియన్కార్యకర్తలు భారీగా బీఆర్‌ఎస్‌లో చేరిక

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 07 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవ ర్గంలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన ఆటో యూనియన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ మరబో యిన రవి యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమాన్ని పాపిరెడ్డి కాలనీకి చెందిన సంతోష్, మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ వారికి పార్టీ కండువా కప్పి హృదయ పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడు తూ..“రోజురోజుకూ ప్రజల నమ్మకం బీఆర్‌ఎస్ పార్టీపై పెరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పూర్తిగా విఫలమైంది. ప్రజలకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్కనమ్మకం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే,”అని అన్నారు. అలాగే ఆయన పేర్కొంటూ “గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలం గాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథ కాలు అమలు చేసింది. ముఖ్యంగా ఆటో కార్మికుల కోసం అనేక పథకాలు తీసుకు వచ్చింది.కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తోంది,” అని విమర్శించారు. “మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించినా,పురుషులపై టికెట్ ధరలు పెంచడం ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపా ధిపై ప్రభావం పడుతోంది,” అని అన్నా రు.ప్రజల కోసం పని చేసే పార్టీ – బీఆర్‌ ఎస్ మాత్రమేనని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *