పారిశ్రామిక విజ్ఞాన విహారయాత్రలో భీంగల్ విద్యార్థులు

పయనించే సూర్యుడు, 07 ఏప్రిల్ 2026 భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ పట్టణంలోని స్థానిక జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక విజ్ఞాన విహారయాత్రలో భాగంగా సోమవారం రుద్రూర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పరికరాల వినియోగంపై అక్కడి శాస్త్రవేత్తలు విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. అనంతరం విద్యార్థులు బాసరలోని ట్రిపుల్ ఐటీని సందర్శించి, అక్కడ ఉన్న వసతులు, బోధన విధానాల గురించి సిబ్బంది ద్వారా అవగాహన పొందారు. తర్వాత బాసర సరస్వతి దేవిని దర్శించుకుని తిరిగి భీంగల్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు జాన్ విల్సన్, ఉపాధ్యాయులు రాములు, భూమేశ్వర్, వాసుదేవ్, మురళి, ఒకేషనల్ ఇన్స్పెక్టర్ రాహుల్, గీతికతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.