పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదోని పట్టణంలోని గణేష్ సర్కిల్ వీధిలో వార్డ్ ఇంచార్జ్ అంజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదోని శాసనసభ్యులు పీవీ పార్థసారథి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని, దేశంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు నాయకులు గోవిందరాజులు గౌడ్ మాట్లాడుతూ ఆదోనిలో మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా గెలిచిన సీటు గణేష్ సర్కిల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయ్ కృష్ణ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, బిజెపి మండల అధ్యక్షులు బోయ మహదేవ్, మధు సుధన్ శర్మ, మాజీ కౌన్సిలర్ సురేష్, రసాలే గోవింద్ రావ్,శివ ,చంద్ర, వీరేశ్, కాశి, తాయప్ప, నాగిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.