పయనించే సూర్యుడు. ఏప్రిల్ 7.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని పెద్దూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్లను.డాక్టర్ కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసనసభ్యులు, ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదలకు గృహాలు కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చక్రవర్తి గౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీఓ.వెంకట్, హౌసింగ్ డీఈఈ హరినాయక్, హౌసింగ్ ఏఈ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి శివ తెల్కపల్లి సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.