
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 07 రంగారెడ్డి ప్రతినిధి ఎస్ఎంకుమార్ డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. కార్పొరేటర్. శేరిలింగంపల్లి డివిజన్… నెహ్రూనగర్, గోపినగర్ పరిసర ప్రాంత బస్తీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు స్థానిక నాయకులతో కలిసి పర్య టించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ.. కొన్ని చోట్ల ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఓపెన్ నాలాలను తొలగించి వాటి స్థానంలో ఆర్ సీసీ పైప్ లైన్ వేసి డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధికరిస్తూ.. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ చర్యలు వర్షపు నీటి నిల్వ మరియు మురుగునీటి పారదుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని స్థానికవాసులు సహకరించాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ.. ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతూ ఆటంకాలు కలిగించడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని అన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారి సహకారంతో.. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్ లోని పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు ల మంజూరు కొరకు సంబంధిత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారితో ఫోన్లో మాట్లాడి తక్షణమే అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులను మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు యాదా గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, నర్సింహా, ఎల్లదాస్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, మహేందర్ సింగ్, రంజిత్, గోపినగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, నరసింహ, శ్రీనివాస్, శేరిలింగంపల్లి నాయీబ్రాహ్మణ ప్రెసిడెంట్ సాయన్న, మంగలి రవి, పరశురామ్, శేఖర్, రాంచందర్, వెంకటయ్య, మల్లేష్, దినేష్, సమీర్, సాయి, షైబాజ్, ఉమా, సలీం, చందు, బాలరాజ్, బిక్షపతి, బబ్లు, రేణు, సజ్జన్ సింగ్, సాయికిరణ్, భరత్ గౌడ్, రేవంత్ మహిళలు ముంతాజ్ బేగం, గిరిజ, స్వరూప, మంజుల, వాణి, అనుపమ, బందెల్లి, వహ్మద, సహాదేవ్ స్థానికవా సులు తదితరులు పాల్గొన్నారు.