ప్రభుత్వ భవనాల్లో సీఎం ఫోటో ఉండాల్సిందే.!

★ అదే లక్ష్యంతో క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో బిగించాం ★ క్యాంపు కార్యాలయం కేసిఆర్ సొంత ఆస్తి కాదు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 7గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తూoకుంట అక్షారెడ్డిఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో ఉండాలనేది ప్రభుత్వ జీవోలు చెప్తుండగా, అదే లక్ష్యంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో బిగించినట్లు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం కేసిఆర్ సొంత ఆస్తి కాదని, ప్రభుత్వ నిధులతోనే ఆ భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని బిఆర్ఎస్ భవన్ గా, సొంత ఆస్తి లాగా, వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నట్లు ఆరోపించారు. శాంతియుతంగా, గొడవలకు అవకాశం లేకుండా, గాందేయ మార్గంలో రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కెసిఆర్ చిత్రపటానికి ఎలాంటి నష్టం చేయకుండా, ఆయన ఫోటోకు ఎదురుగా సీఎం ఫోటో బిగించినట్లు పేర్కొన్నారు. కాగా ప్రజా పాలనలో భాగంగా 5వ వార్డులో కేసీఆర్ ఫోటో లేదని సీఎం ఫ్లెక్సీని అధికారుల సమక్షంలోనే మున్సిపల్ చైర్మన్ తొలగించగా, దానిని దృష్టిలో పెట్టుకొని తాము రేవంత్ రెడ్డి పెట్టినట్లు చెప్పారు. అయితే బిఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తెచ్చినందున తాము స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని, సమస్యలు పరిష్కరించని, ప్రభుత్వ సొమ్ము వేతనంగా పొందుతున్న ఎమ్మెల్యే కేసీఆర్ ను తొలగించాలని కోరుతూ సిద్దిపేట నుండి గవర్నర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి వినతి పత్రం అందజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. క్యాంపు వద్ద తాము ఎలాంటి దాడులు, దౌర్జన్యం, ధ్వంసం చేయలేదని, అది తమ అభిమతం కూడా కాదని తెలిపారు. కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుండగా, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. క్యాంపు ఆఫీసు నిర్మించి ఏడేండ్లు దాటుతున్నప్పటికీ కెసిఆర్ అడుగు పెట్టిన దాఖలాలు లేవని, ఆయన ఇప్పటికైనా తన ఆఫీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించాలనే
లక్ష్యంతో వెళ్లినట్లు తెలిపారు. గతంలో సైతం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందించే ప్రయత్నం చేయగా, కెసిఆర్ అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. ఆయన గజ్వేల్ అభివృద్ధి కోసం క్యాంపు కార్యాలయానికి వస్తే సహకరించడానికి సిద్ధంగా ఉండగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కు తప్పకుండా గౌరవిస్తామని ఆంక్షా రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, కౌన్సిలర్లు, నేతలు నర్సింహారెడ్డి లక్ష్మీ శ్రీనివాస్, సంతోష రాములు గౌడ్, సారిక శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి సమీర్ అస్గర్ కొడా్కొండ్ల బాలు అజీమ్ పాల్గొన్నారు.