బిజినపల్లి మండల కేంద్రంలో బీసీ నాయకుల సమావేశం

సమావేశంలో అధ్యక్షులు సత్యశీల సాగర్. దాసర్ల వెంకటస్వామి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని గౌడ సంఘం కార్యాలయంలో ఈరోజు మండల బీసీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి బీసీ నాయకులు శ్రీ అంతటి రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు అనగా తేది 11-04-2026న మహాత్మ జ్యోతి రావ్ పూలే జయంతి నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, జన సమీకరణ అవసరం, గ్రామ స్థాయి బీసీ కమిటీల బలోపేతంపై వివరంగా చర్చించినట్లు తెలిపారు. బీసీ సమాజ అభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్, మండల గౌరవ అధ్యక్షులు దాసర్ల వెంకటస్వామి, మండల కార్యదర్శి అతినారపు బాల్ లక్షుమయ్య, మండల ఉపాధ్యక్షులు ఇగురంబాధ శ్రీనివాసులు, మండల కోశాధికారి వంగ రామన్ గౌడ్, పాలెం ఉపసర్పంచ్ గోవింద్ శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు అబ్బ కర్ణాకర్, మండల నాయకులు శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు వడ్డె తిరుపతయ్య, శసాని సంతోష్ సాగర్, చింతకాయల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *