బిజినేపల్లిలో కబ్జాల భాగోతం

ఖాళీ స్థలాలపై బిజినేపల్లి పంచాయతీ సభ్యుడి కన్ను లబోదిబోమంటున్న బాధితులు ఎస్పీకి పిర్యాదు చేయనున్న భాదితులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి : ప్రస్తుత బీజినపల్లి గ్రామ పంచాయతీలో కీలక సభ్యుడిగా ఉన్న ఒక ప్రజా ప్రతినిధి మండల కేంద్రంలో ఖాళీగా కనిపిస్తున్నాయని రెండు ప్లాట్లను ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఇద్దరు వ్యక్తులకు చెందిన రెండు ప్లాట్లను పాత సర్పంచి ద్వారా ఈ బాగోతానికి ఒడిగట్టాడు. ప్రస్తుత బిజీనపల్లి పంచాయతీ సభ్యుడికి, పాత సర్పంచికి మధ్య బినామీ లావాదేవీలలో భాగంగా కబ్జాలు చేసినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. గత అధికారులు తమకు కేటాయించిన ప్లాట్లలో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం గ్రామ పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారి ప్లాట్లు వేరే వ్యక్తి పేరు మీదకు మారినట్లు తెలుసుకున్నారు. తీరా ఆ వ్యక్తి ప్రస్తుత గ్రామ పంచాయతీలో కీలక సభ్యుడిగా ఉన్నాడని తెలిసింది. ఇదేమిటని నీలదీయడానికి వెళ్లిన బాధితులకు అప్పు కింద పాత సర్పంచి ద్వారా చేసుకున్నాను అని ఆ సభ్యుడు సమాధానం ఇచ్చాడు. తిరిగి తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని, మోఖా మిద తామే ఉన్నామని బాధితులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఒకరికి చెందిన ప్లాట్లను మరొకరికి ఎలా కేటాయిస్తారు అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా కనిపిస్తే వ్యక్తిగత అప్పుల కింద ఎక్కడైనా ప్లాట్లు రిజిస్ట్రీ చేసుకుంటారా అనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులపై త్వరలో ఎస్పీని ఆశ్రయిస్తామని బాధితులు ఆరోపిస్తున్నారు.