బిజెపి జెండా ఆవిష్కరణ చేసిన మాజీ కౌన్సిలర్ లలితమ్మ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ జెండా పుట్టినరోజు కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ అమరావతి నగర్ కాలనీలో ఇరవై సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగేదని కొంత మంది స్వార్థపర రాజకీయ శక్తులు అమరావతి నగర్ కాలనీలో చేరుకోవడం వలన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.మేము భారతీయ జనతా పార్టీ లో చేరిన వెంటనే అమరావతి నగర్ కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.అమరానగర్ కాలనీ దినదినాభివృద్ధి చెందాలి అంటే అమరావతి నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలని లలితమ్మ ఆకాంక్ష వెల్లడిచేసారు.ఆదోనిలో ప్రజలందరూ కలిసి డాక్టర్ పివి పార్థసారథి ని ఎమ్మెల్యే గా గెలిపించి భారతీయ జనతా పార్టీ ఆదరించడం వలన ఆదోని మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 10 కోట్ల రూపాయల పనులు అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుండి పల్లెల్లో దాదాపు 16కోట్ల రూపాయల నిధులతో రోడ్లు డ్రైనేజీలు వేయించడం జరిగిందని లలితమ్మ వివరించారు.కాబట్టి అభివృద్ధి అనేది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని లలితమ్మ ఆదోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా, సౌత్ జోన్ బిజెపి మండల ఉపాధ్యక్షురాలు నూర్జహాన్, సౌత్ జోన్ బిజెపి సెక్రటరీ పరుశురాం రాముడు మొదలైన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.