పయనించే సూర్యుడు ఏప్రియల్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన డిఆర్డిఏ 54.36 లక్షలతో 50 మంది మత్స్యకారులకు సహకారం అందిస్తుందని ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు అండగా ఉంటూ వారికి అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్తున్నామని ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట గ్రామం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏపీ మత్స్య శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎం ఎం ఎస్ వై) డిఆర్డిఏ కలయికలో రూ 54.36 లక్షల నిధులతో కాకినాడ రూరల్, కరప మండలం, కొత్తపల్లి మండలానికి చెందిన 50 మంది మత్స్యకారులకు 26 ఇంజన్లు14 వలలో, 5 ఫైబర్ బోట్లు, మూడు ఆటోలు మరియు రెండు ఐస్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కర్రి పద్మజ ,మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి లు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ మత్స్య కారుల జీవన ప్రమాణం ఆదాయం పెంచేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 21 వేల కోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా 60% వాటా సొమ్మును డిఆర్డిఏ అందిస్తుందని 40 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తుందని అన్నారు మత్స్యకారుల కోసం ఫిషింగ్ ఆర్బర్ అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పన కొరకు 72 కోట్లు నిధులు మంజూరు చేయించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు పెంకె శ్రీనివాస బాబా ,చప్పిడి వెంకటేశ్వరరావు ,నులుపుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, సోది ముసలయ్య మత్స్యకార శాఖ జిడివి కృష్ణారావు ఏడి లావణ్య, ఎఫ్ టి వో లు మధుబాబు, నూకరాజు ఉమామహేశ్వరరావు గోపి రామకృష్ణ , జనసేన నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.