మహానీయులఅడుగుజాడల్లోనడవాలిముద్దాయిపేట సర్పంచ్ ప్రవీణ యాదయ్య

పయనించేసూర్యుడు. న్యూస్. 7 .ఎప్రిల్. పుల్కల్ మండల ప్రతినిది.పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలోని ముద్దాపేటలో విలేఖరుల సమావేశంలో ముద్దాయిపేట సర్పంచ్ మ్యాతరి ప్రవీణ యాదయ్య మాట్లాడుతు దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషిచేసిన సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి పురస్కరించుకొని పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవీణ యాదయ్య మాట్లాడుతూ ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం ఆలు పెరగని సమరం సాగించిన యోధుడు సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీనవర్గాల నేత మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ మ్యాతరి ప్రవీణ-యాదయ్య.జోగిపేట మార్కెట్ కమిటి డైరెక్టర్ పి.కమాల్ రెడ్డి.పి.జి.విజయ్ కుమార్. ఉపసర్పంచ్ పి.జి.సత్యనారాయణ. వార్డుసభ్యులు డి.రాజశేఖర్ ,పి.శ్రీకాంత్. యం.బాగయ్య. బాలమణి. నవరాణి. పి.రాజురెడ్డి. మరియు గ్రామప్రజలు. యువకులు. పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *