పయనించే సూర్యడు ఏప్రిల్ 07 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం రత్నవరం గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య భార్య, ఐద్వా నాయకురాలు విజయ సోమవారం గుండెపోటుతోచనిపోవడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయనీ, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సిపిఎం మండల కమిటీ, ప్రజా సంఘాల నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కిషోర్ ,శ్రీనివాస్, ఆంజనేయులు, హనుమయ్య, వంశీ ,సుధాకర్ రెడ్డి ,సీతారామరెడ్డి, శేఖర్ రెడ్డి , కృష్ణయ్య,పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆమె మృతి పార్టీ ప్రజాసంఘాలకు తీరని లోటు అన్నారు.