మిరాకిల్ మినిస్ట్రీస్ అధినేత దంపతులకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 07 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : మండలంలోని తిరుమాలి,పేరవరం గ్రామాల మిరాకిల్ మినిస్ట్రీస్ చర్చ్ అధినేత పాస్టర్ పి.ప్రవీణ్ పాల్,సంకీర్తన పాల్ దంపతులను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పాల్ మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తుకు దైవజనులు శ్రమ దినాలు 40 రోజులు భక్తిశ్రద్ధలతో చేసి ముగిసిన సందర్భంగా ఈస్టర్ పండుగ రోజు చర్చి సభ్యులందరూ మా దంపతులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే ప్రభువైన యేసు క్రీస్తు కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *