యువత సరైన దిశలో నడిచేందుకు క్రీడలు దోహదపడతాయి.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 07 మామిడిపెల్లి లక్ష్మణ్ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే దాగి ఉందని ఆ యువత సరైన దిశలో నడిపించాలంటే క్రీడలు అత్యంత అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ధ్రువ బాక్స్ క్రికెట్, ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించి క్రీడా పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు వెళ్లకుండా, విద్యార్థులు మొబైల్ ఫోన్లకు కు అలవాటు కాకుండా నిర్వాహకులు జీవన్ ఏర్పాటుచేసిన బాక్స్ క్రికెట్, షటిల్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాదు, మానసిక ధైర్యం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ నైపుణ్యాలకు పునాది వేస్తాయి” అని పేర్కొన్నారు. మైదానంలో చెమటోడ్చే యువతే జీవితంలో విజయం సాధిస్తారని క్రీడల వైపు మళ్లిన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే కాదు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. క్రీడల్లో గెలుపు-ఓటములు సహజమని, కానీ క్రీడాస్ఫూర్తితో పోటీ పడటమే అసలైన విజయం అని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీంధర్, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత, యాజమాన్యం అనుమండ్ల జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు రాకేష్, ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, నాయకులు గోపి రాజారెడ్డి, మ్యాకల రమేష్, తురగ శ్రీధర్, మచ్చ శేఖర్, ఎలిగేటి అనిల్, బాపురపు నరసయ్య, బత్తిని భూమయ్య, కట్కం కళ్యాణ్, మున్ను, భూమేష్, కడకుంట్ల నరేష్, నాగరాజు, నవీన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.