విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనాలి…

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 6 అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్ బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ రోడ్ లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని , స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు రావడానికి అవకాశం కలదు అని క్రీడల గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల పిఈటి రవికుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రంగస్వామి, విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేత్ర బృందం పాల్గొనడం జరిగినది.