వేణుగోపాలస్వామికి వెండి కవచం బహుకరణ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 07.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) స్థానిక రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి దాత స్వామివారికి వెండి కవచాన్ని అందించారు పట్టణంలో గల బజారు వీ ది లో గల శ్రీరామ్ గోపాల్ శ్రీరామ్ జగదీష్ కుటుంబ సభ్యులు వేణుగోపాలస్వామికి రూ 2.10 లక్షలు విలువ చేయు వెండి వక్షకవచం అందించారు ఈ మేరకు సోమవారం ఉదయాన్నే దాతలు గ్రామ పెద్దలు జీవన్ ప్రకాష్ కడియాల రాజన్న బంకు రాజన్న రంగబాబు తదితరులచే ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులకు అందించారు అనంతరం స్వామివారికి అలంకరించి విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు