శంకరపట్నం మండలంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు ఎనుగుల అనీల్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి బిజెపి పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ 1980లో పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణ కలిగి ఉండి, నేడు ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన అతి పెద్ద పార్టీగా బిజెపి ఆవిర్భవించిదని, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని రాష్ట్రాలలో బిజెపి పాక వేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, గద్దపాక ఉపసర్పంచ్ జంగ జైపాల్, బిజెపి నాయకులు దొంగల రాములు, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, గౌరవేణి శ్రీనివాస్, ఎల్కపల్లి సంపత్, వడ్లకొండ రాజేందర్, మొలంగూరి‌ ప్రశాంత్, బొజ్జ సాయి ప్రకాష్ ,పోతునూరి రాజు, కుమార్, రవి, రంజీత్. సందీప్ ,స్వామి,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *