సంజయ్ వినాయక్ జోషి కిజన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అఖిల భారతీయ గో రక్ష మహా సంఘ్ నాయకులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 07.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రాజకీయ వేత్త సంజయ్ వినాయక్ జోషి జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ గో రక్ష మహా సంఘ్ నాయకులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా అఖిల భారతీయ గో రక్ష మహా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అయూబ్ ఖాన్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వేంపల్లి అష్రఫ్ సంజయ్ జోషి ని ఢిల్లీలో కలిసి ఆయనకుపుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ​సంజయ్ జోషి నిబద్ధత గల నాయకుడని, ఆయన ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ​ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ​సమాజ సేవలో మరియు గో రక్షణలో ఆయన ఇస్తున్న స్ఫూర్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో సంఘం ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ​ఇట్లు, మీడియా సెల్, అఖిల భారతీయ గో రక్ష మహా సంఘ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *