సరైన ఆహారం తీసుకోండి-ఆరోగ్యంగా జీవించండి

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

పయనించి సూర్యుడు ఏప్రిల్ 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ సరియైన, సురక్షితమైన పౌష్టికాహారం తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి అని నాగర్ కర్నూల్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ బాధావత్ సంతోష్ గారు తెలిపారు.సోమవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఈట్ రైట్ వాకతాన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ గారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితమైన ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు,యువత చిప్స్,కేకులు,న్యూడిల్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తదితర జంక్ ఫుడ్ తీసుకోకుండా సీజన్లో చౌకగా స్థానికంగా దొరికే పండ్లను తీసుకోవాలని, ఉప్పు,చక్కెర,నూనెలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు ఆహారములో ఆకుకూరలు,కాయగూరలు,స్థానికంగా దొరికే పండ్లు,జొన్నలు, రాగులు,సజ్జలు తదితర తృణధాన్యాలు తీసుకోవాలి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ టి.ఉషారాణి,ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీలత రెడ్డి, ఆర్ఎంఓలు, హెడ్ నర్సులు, నర్సింగ్ అధికారులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఇతర సిబ్బంది,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణమోహన్,డాక్టర్ సురేష్ బాబు,డాక్టర్ ప్రదీప్,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి,ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి,డి పి ఓ రేనయ్య, పర్యవేక్షణ సిబ్బంది వై శ్రీను, సుకుమార్ రెడ్డి,విజయ్ కుమార్, విజయ్,రాజేష్, బంగారయ్య, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్,కళ్యాణ్ కృష్ణ,ఎ ఎన్ఎంలు సరస్వతి, జిజే కవిత ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.