ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 08.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చౌడేపల్లిలో చోటు చేసుకుంది పోలీసులు అగ్నిమాపక అధికారుల కథనం మేరకు… మండలంలోని చారాల పంచాయతీ ఓదుల పేటకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి వయసు37 స0 తిరుపతిలో తన భార్యతో సహా ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు చౌడేపల్లి లో గంగ జాతర సందర్భంగా పొదలపల్లికి తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం చిట్టి రెడ్డి పల్లి చెరువు కీలేరు నందు గల ఓ వ్యవసాయ బావిలో తన స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్ళాడు అక్కడ ఈత కొడుతుండగా అకస్మాత్తుగా నీటిలోకి మునిగిపోయాడు చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బావిలోకి అప్పటికప్పుడే దూకి వెతుకుగా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ . ఐ. చిన్న రెడ్డప్ప పుంగనూరు నందుగల రెస్క్యూ టీంకు సమాచారం అందించారు వారు వెంటనే స్పందించి వ్యవసాయ బావివద్దకు చేరుకొని దాదాపు అరగంట పాటు శ్రమించి చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు సమాచారం తెలిసిన వెంటనే చు ట్టుపక్కల గ్రామస్తులు వారందరూ భావి వద్దకు వెళ్లారు ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు రెస్క్యూ టీం సభ్యులు సుబ్రహ్మణ్యం లోకేష్ రెడ్డి సురేష్ బాబు ప్రకాష్ ఆనందలు స్థానిక పోలీసులు పాల్గొన్నారు