ఎం.ఏ నగర్‌లో రేణుక ఎల్లమ్మఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటి ఆర్ పి రంగారెడ్డి జిల్లా నాయకులు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 08 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ రంగారెడ్డి జిల్లాలోని మియాపూర్, ఎం.ఏ నగర్ ప్రాంతంలో బస్తీ ప్రజలు కలిసి నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రారం భోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రా జ్యాధికార పార్టీ (పి ఆర్ పి) రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బస్తీ నాయకులు అధ్యక్షులు యాది, ఉపాధ్యక్షుడు రాములమ్మ, లచ్చప్ప, తిమ్మయ్య, స్వామి, చిన్న తెల్లప్ప, చంద్రకాంత్ ఆహ్వానం మేరకు జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్,మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసు కి, మీడియా ఇంచార్జ్ ప్రశాంత్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఆర్పి నాయకులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని, బస్తీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానికులు నిర్మించిన ఆలయం ప్రాంతంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమైన నాయకులు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయించేం దుకు కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పు డూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజల అభివృద్ధి, ప్రాథమిక సదుపా యాల కల్పనలో టిఆర్పి పార్టీ ముందుం టుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.