ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన తోటపల్లి పంచాయతీ సభ్యులు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్/08 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం. సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 5 గురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు ముత్త బీరయ్య, దయ్యాల ఐలవ్వ-ఐలయ్య, ఏనుగుల అనిత -అశోక్, నల్లగొండ రాములు, జనగం లక్ష్మి – లక్ష్మయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల ఐలేష్, పార్టీ నాయకులు బైర సంతోష్, గుంటి అంజి, గుంటి అశోక్, గుంటి ఓదెయ్య, ఒగ్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు.