ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం.

* బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలి. * రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.08.2026 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం పై ఉద్దేశ్య పూర్వక దాడులు హేయమైన చర్యని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం నుండి”వీకెండ్ కామెంట్ బై ఆర్కే”కార్యక్రమంలో మావిగన్ అంశం పై కథనం ప్రసారమైంది.దీనిపై వైకాపా నేతలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై భౌతిక దాడికి దిగారు.దీంతో ఆమె మంగళవారం ప్రకటన ద్వారా వైకాపా నేతల చర్యలను ఖండించారు.ఇదంతా కేవలం వైకాపా నేతలు ప్రజల మనసులు మళ్లించేందుకే ఇలాంటి దాడికి దిగారన్నారు.మీడియా సంస్థలపై భౌతిక దాడులకు దిగటం వైకాపా దిగజారుడు.తనానికి నిదర్శనం అన్నారు.మీడియా సంస్థల పై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి తప్పా ఇలా దాడులు చేయటం మంచిది కాదని హితవు పలికారు.ఇలాంటి అరాచక శక్తుల పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *