ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి

సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ఈరోజు సిపిఎం బృందం సందర్శించింది సిపిఎం నాయకులు మార్కెట్ కు తెచ్చిన మొక్కజొన్న రైతుల సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఆరుగాల కష్టపడిన రైతులు మార్కెట్కు మొక్కజొన్న ధాన్యాన్ని తెస్తే ఫంగస్ పేరుతో సన్నాళ్ల పేరుతో మార్క్ఫెడ్ ఇన్చార్జి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని అన్నారు గ్రామాల నుండి ఇక్కడ దాకా వస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గత పది రోజుల కిందటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు మార్కెట్ ఇన్చార్జి కొనుగోలులో జాప్యం చేస్తున్నారని అన్నారు అక్కడ కొన్ని మొక్కజొన్న రాశులను పరిశీలిస్తే అవి బాగానే ఉన్నా ఫంగస్ ఉన్నాయని చెప్తున్నారని ఇది సరైన చర్య కాదని అన్నారు చైర్మన్ మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని సందర్శించి అవి ఎలా ఉన్నా కొనుగోలు చేసే విధంగా చూడాలని అన్నారు రైతును రాజును చేస్తామని చెప్పుకుంటున్న మనం రైతులు ఇబ్బందులు పడుతుంటే చూడడం సరికాదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవచూపి మార్కెట్ బాధ్యులతో మాట్లాడి మొక్కజొన్నలను కొనే విధంగా చూడాలని కోరారు కలెక్టర్ పై అధికారులు స్పందించి మార్క్ఫెడ్ బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు తక్షణమే ఏ షరతులు లేకుండా మార్కెట్కు వచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రేపు ఉదయం 10 గంటలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు తోడెంగల ఐలయ్య రైతు సంఘం నాయకులు రైతులు మంద మొగిలి నీరటి సంపత్ దాసరి కోరయ్య కాసు నాగరాజు సంపత్ మార్కెట్లో ఉన్న రైతులు తదితరులు పాల్గొన్నారు