ఒత్తిడి లేని జీవితం ఆరోగ్యానికి మూల కారణం

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 08 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఆరోగ్యానికి మూల కారణం ఒత్తిడి లేని జీవితం గడపడమే అని కాకినాడ జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఎన్ ప్రశాంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద జే అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.ఈర్యాలీలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎన్ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఒత్తిడి లేకుండా తమ కుటుంబ సభ్యులతో గడపాలని ఆమె కోరారు. విజ్ఞానానికి అండగా నిలుద్దాం ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం, మంచి అలవాట్లు ఆరోగ్యానికి సోపానం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ సురేష్, వైద్యులు బి శ్రీకాంత్, సి హెచ్ ఓ పి మాణిక్య కుమారి, హెల్త్ సూపర్వైజర్ కే దైవ కృప, హెల్త్ అసిస్టెంట్లు పి నాని బాబు,ఇ జగదీష్ ,ఎన్ రాజేంద్రప్రసాద్,డి రాజు,జి రవికుమార్, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పి లు, ఆశాలు తదితరులు ఉన్నారు.