కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కోసం ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపు

★ కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి ★ ఏజెన్సీ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 8 చింతూరు లో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఐ యన్ టి యు సి ,పారామెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ, ఇంకా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోందని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం, సర్వీస్ భద్రత, అన్ని హక్కులు కల్పించాలని కోరారు.ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్ల పనిభారం పెరిగి, సేవల నాణ్యత దెబ్బతింటోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి తగిన సదుపాయాలు, భద్రత, అవసరమైన మానవ వనరులు అందించాలన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, దశల వారీగా నిరసనలు, చేపడతామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు, సలహాదారులు ఎం నెహ్రూ,రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సీతమ్మ, రాష్ట్ర కోశాధికారి కె అర్జున్, ప్రచార కార్యదర్శి కె సత్తిబాబు, ఐ యన్ టి యు సి డివిజన్ అధ్యక్షులు డి శ్రీనివాసరావు, సి హెచ్ ఓ జిల్లా కార్యదర్శి యన్ పవన్ కళ్యాణ్ చింతూరు డివిజన్ పారామెడికల్ సిబ్బంది అందరు పాల్గొన్నారు