(పయనించే సూర్యుడు) 8-4-26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండల రిపోర్టర్ హన్మంతు : వికారాబాద్ జిల్లా పరిగి మండలం లోని కళపూర్, రాపోల్ గ్రామాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్న నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రైతులకు అండగా రైతులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యలను విరమించుకోవాలని, రైతుల పొట్ట కోట్టకూడదని ఆరోపించారు. బి ఆర్ ఎస్. పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. భరోసా ఇవ్వడం జరిగింది.