పయనించే సూర్యడు ఏప్రిల్ 8 చండూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో గత మూడు నెలల కాలంగా డిప్యూటీ తహసిల్దార్ పోస్టు ఖాళీ ఏర్పడిందని దీంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కాళీ ఏర్పడిన చండూరు మండలానికి నూతనంగా డిప్యూటీ తహసిల్దారుని నియమించాలని బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పోస్టు ఎంతో కీలకమని ఇలాంటి కీలక పోస్టుని నెలల కొద్ది ఖాళీగా పెట్టడం సబబు కాదన్నారు. ఈ విషయమే త్వరలో జిల్లా కలెక్టర్ ను కలవనున్నట్లు ఆయన తెలిపారు.