చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : మన్సూర్ ఖాన్

పయనించే సూర్యుడు 08-04-2026-రాజంపేట న్యూస్ : చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ నగర అధ్యక్షులు మన్సుర్ ఖాన్ ఆలీ తెలిపారు. గత నెల ఫిబ్రవరి 21, 22 వ తేదీలలో నెల్లూరు జిల్లా కావలి పట్టణం డి.బి.ఆర్ ఇంజనీరింగ్ కలాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి జంప్ రోప్ గేమ్స్ లో ఉర్దూ స్కూల్ బుచ్చర్ స్టేట్ విద్యార్థినీ -విద్యార్థులు స్వర్ణ మరియు రజత పతకాలు సాధించగా మంగళవారం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మన్సూర్ ఖాన్ అలీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించి భక్తి శ్రద్ధలతో మెలగాలని సూచించారు. నగర ఇంచార్జి, వార్డు సభ్యులు రాఘవేంద్ర మాట్లాడుతూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఆటల్లో ముందు ఉండి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి అబ్దుల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సికిందర్ బేగం , సికిందర్ భాష, జమీల్ భాష, నాయబ్ రసూల్, నజీముల్లా, చాంద్ బాషా, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *