జగన్నాధపురంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 08, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ తాళ్ళూరి స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 ధరతో, ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకు గ్రామ రైతులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు చింతకాని మహిళా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి, చింతకాని సీఈఓ శ్రీనివాసరావు, ఏఈఓ కార్తీక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, గ్రామ కార్యదర్శి చామర్తి కృష్ణమాచారి, వార్డు సభ్యులు తోటకూరి హరీష్, గమ్మిడి శీను, కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి రమేష్, తోటకూరి సైదేశ్వరరావు, నరసింహారావు, తన్నీరు పుల్లారావు, మాజీ సర్పంచ్ ఆలస్యం నాగయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టల కృష్ణ, ఉపాధ్యక్షులు యరమల ప్రసాద్, ముల్లంగి కోటయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.