పయనించే సూర్యడు ఏప్రిల్ 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ మరియు యశోద హాస్పిటల్ మలక్ పేట ఆధ్వర్యంలో తేదీ 11-4-2026 శనివారం నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న మెగా హెల్త్ & ఈ వై ఈ క్యాంపు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దున్నా శ్రీనివాస్,చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్ లు మంగళవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ హెల్త్ క్యాంపులో అన్నీ రకాల విభాగాల డాక్టర్స్ అందుబాటులో ఉంటారని,పరీక్షలు బీపీ,షుగర్,ఈసీజీ,2డి ఏకో,కంటి పరీక్షలు నిర్వహించి, క్యాటరక్ట్ ఉన్నవారికి గుర్తించి.సర్జరీ కావాల్సిన వారికి సూర్యాపేట లయన్స్ హాస్పిటల్ కు బస్సు లో అదే రోజూ తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారని నిర్వహకులు తెలిపారు. ఈ క్యాంపులో సుమారు 4000 రూపాయల విలువ గల పరీక్షలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు గ్రామ సర్పంచ్ చరవాణి 90109 41994, ఉప సర్పంచ్ చరవాణి 9705052900 ద్వారా పేర్లు నమోదు చేసుకోగలరని తెలిపారు…