నిరుపేద కుటుంబానికి డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సహాయం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 08,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామం డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో పాతర్లపాడు గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి సహాయం అందించారు. గ్రామానికి చెందిన జూపూడి తిరుపమ్మ కుటుంబానికి అవసరార్థం ఒక బియ్యం సంచిని అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న పేద, బలహీన వర్గాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు దస్తగిరి, గ్రామ సర్పంచ్ ఓబీనబోయిన లక్ష్మి అచ్చయ్య, ఉప సర్పంచ్ దారెల్లి సురేష్, వ్యవసాయ కార్మిక శాఖ మండల సభ్యులు పంగ గోపయ్య, మాజీ ఉప సర్పంచ్ చెరుకుపల్లి సుందరయ్య, సీపీఎం నాయకులు గార్లపాటి రమేష్, గుర్రాల వెంకటేష్, ఉసికల గణేష్, అబ్బురి దావీదు, అరెంపేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.