పదో తరగతి స్పాట్ రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలి: టీజేఏసీ నిరసనలో డిమాండ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8: (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) టీజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగమ్మగారి రమేష్ పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.గత ఏడాది బకాయిలు: పోయిన సంవత్సరం పదో తరగతి జవాబు పత్రాల దిద్దుబాటు పని చేసిన ఉపాధ్యాయులకు రావాల్సిన వేతనాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ప్రస్తుతం సాగుతున్న జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయులకు డబ్బులు అందజేయాలి.చదువుల వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చూపడం తగదని, వారి న్యాయమైన కోర్కెలను వెంటనే తీర్చాలని రమేష్ కోరారు.ఈ నిరసనలో జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, పటాన్‌చెరు విభాగం అధ్యక్షుడు పెంట్యనాయక్ తో పాటు లక్ష్మణ్, కృష్ణ, చంద్రశేఖర్, నవీన్ కుమార్, మొగులయ్య, వీరేశం, వెంకటలక్ష్మి, సంగీత, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు