పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 8 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ నిత్యానందనగర్ లో సినీ ప క్కీలో మంగళవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. శ్రీ వెంకటేశ్వర జువెలరీ షాపు కు ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి, ఆ షాపు యజమాని అయిన. కెల్లం శెట్టి రామకృష్ణను షాపులో కట్టివేసి ముప్పావు కేజీల బంగారాన్ని బైకుల మీద వచ్చి ఎత్తుకుపోయారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగలు చేసిన బీభత్సంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టపగలు భయం లేకుండా పలాస ప్రాంతంలో దొంగలు తమ పనులను చేసుకుంటూ పోతున్నారని ఇలా అయితే తాము ఎలా వ్యాపారాలు చేసుకోగలమని బంగారు వర్తకులు వాపోతున్నారు. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు దర్యాప్తు చేస్తున్నారు