పుల్లెంల గ్రామంలో సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 08. చండూరు మండ‌లంలో పుల్లెంల గ్రామంలోని ల‌బ్ధిదారుల‌కు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను కాంగ్రెస్ నాయ‌కులు మంగ‌ళ‌వారం పంపిణీ చేశారు. పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్యకు రూ.24 వేలు, బొడ్డు వెంకన్నకు రూ.15 వేలు, లోక జయశ్రీ- రూ.60 వేలు, నీలకంఠం మారయ్య- రూ.27 వేలు, ముక్కముల రాజు- రూ.24 వేలు, పాలకూరి సైదులు- రూ.15 వేలు, ఓర్సు కళ్యాణ్- రూ.60 వేలు, ఎర్ర యాదగిరి- రూ.60 వేలు మొత్తం 2, 85,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కముల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ చెడుబుద్ధి ఉషయ్య, మాజీ ఎంపీటీసీ వడ్డగోని రాఘవేందర్, మండల నాయకుడు మందడి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.