ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తా

పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం పాలకుర్తి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రామంలోని ఇసుక దేవి బాయి వద్ద కొత్తగా బోరు మోటార్‌ను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇటీవలి కాలంలో తాగునీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బోరు మోటార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బోరు ద్వారా గ్రామ ప్రజలకు నిరంతరంగా శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదపాక కిరణ్, పంచాయతీ కార్యదర్శి రూబీన, వార్డు సభ్యులు మామిండ్ల కవిత, శోభన్ బాబు, కమ్మగాని సుధాకర్, జలగం మమత నరేష్, నెమరుగొమ్ముల శ్రీనివాసరావు, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *