పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 8 ఉత్తమ సేవలందించిన వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు సర్పంచ్ పుల్ల సాయి గౌడ్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి )లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిని జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పుల్ల సాయి గౌడ్ సత్కరించారు. గ్రామ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు పీహెచ్‌సీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యురాలు గా డా. తాటిపర్తి శివాని ని సత్కరించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఆమెను ప్రశంసించారు. అదేవిధంగా ఉత్తమ ఏఎన్‌ఎం గా ఎన్. ప్రియదర్శిని కి పురస్కారం అందజేశారు. అలాగే గ్రామాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేస్తూ కృషి చేస్తున్న ఆశా కార్యకర్తలకు కూడా అవార్డులు ప్రదానం చేశారు. రంగారావుపేటకు చెందిన సిలువేరి మమత మరియు కొండ్రికార్ల గ్రామానికి చెందిన చిలువేరి రేఖ ఉత్తమ ఆశా కార్యకర్తలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుల్ల సాయి గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.ఎల్లాల అంజిత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,11వ వార్డు సభ్యులు రాజేశం ,పీహెచ్‌సీ సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేయడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.