
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ టౌన్ ఆకాంక్ష ఏప్రిల్: 7::నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వైద్య సేవలను సమర్థవంతంగా అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. నాగర్ కర్నూల్ మండలానికి చెందిన పెద్ద ముద్దునూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణిని బిజినేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ సృజన జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సురేష్ బాబు లకు ప్రశంస పత్రం అందజేశారు.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుండడంతో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయడంలో వీరి కృషి ప్రశంసనీయం అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా గ్రామాల వరకు వైద్య సేవలు చేరుతున్నాయని తెలిపారు. వైద్య సిబ్బంది కృషితో అనేక వ్యాధులను ముందుగానే గుర్తించడం. సాధ్యమవుతోందన్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు డాక్టర్ రవి నాయక్. డిప్యూటీ డిఎంహెచ్వో భరత్ రెడ్డి . కూడా డాక్టర్ల సేవలను అభినందించారు.వారి కృషిని గుర్తిస్తూ ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారిపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని తెలిపారు. ఇక ముందు మరింతగా ప్రజలకు చేరువ అవుతామని చెప్పారు.. గ్రామ గ్రామానికి వెళ్లి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తమ లక్ష్యమని అన్నారు. ప్రత్యేకంగా వైద్య శిబిరాలలో రోగులను వారికి ఉచిత పరీక్షలు, మందులు అందజేస్తామని చెప్పారు.ప్రజలు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అప్పుడే వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై డాక్టర్లను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా అందరూ గుర్తించారు.