
పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రి /08: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు, నల్లగొండ గ్రామాల్లోగల ప్రభుత్వ స్థలాలను మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అల్గునూరు గ్రామంలో 4 ఎకరాలు, నల్లగొండలో 2-10 ఎకరాల ప్రభుత్వ స్థలలాను పరిశీలించారు. నివేశన స్థలాలు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇప్పించడమే కాకుండా వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ సొంతికలను సాకారం చేయాలనే సంకల్పంతో ఈ స్థలాల పరిశీలన చేశారు. ఈ గ్రామాల్లో అనువైన ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను నిరుపేదలకు ఇచ్చేందుకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరగా, అసైన్ మెంట్ కమిటీ ఆమోదం మేరకు సత్వర చర్యలు తీసుకుంటామని, ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అనుమతులు పొందేలా చూస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తిమ్మాపూర్ తహశీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు ఎ.రమేశ్ యాదవ్, గోపు మల్లారెడ్డి, కంది లక్ష్మినారాయణ రెడ్డి, కంది అశోక్ రెడ్డి,చిందం కిష్టయ్య, పి.శ్రీకాంత్, నాగేందర్, తాళ్లపల్లి శ్రీనివాస్ రావు, నల్లగొండ సర్పంచ్ మారుతితోపాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.