పయనించే సూర్యుడు / ఏప్రిల్ 8 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు భక్తి భావంతో, వైభవంగా ముగిశాయి. దాదాపు 13 రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడంలో అనేక సంస్థలు, శాఖలు సమన్వయంతో పనిచేశాయి.
జమ్మికుంట ప్రాంతానికి చెందిన కాటన్ మిల్లర్స్, పారాబోయిల్డ్ రైస్ మిల్లర్స్, రా రైస్ మిల్లర్స్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు విశేష సేవలు అందించారు. ప్రతి రోజూ వందలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, ఆర్ & బి, ఆరోగ్యశాఖ, యాజమాన్యం, రెవెన్యూ శాఖ, 108 సర్వీసులు, మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, 18 గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉత్సవాలను ప్రజలకు చేరవేయడంలో సహకరించారు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కృషి చేసిన పోలీస్ శాఖను దేవస్థానం పాలకవర్గం ప్రత్యేకంగా అభినందించింది వారి సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు కూడా శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు గోలి కిరణ్, గోడిశాల పరమేష్, కారింగుల రాజేందర్, కురిమిండ్ల చిరంజీవి, ఎడ్ల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.