భాస్కర్ రెడ్డి కాలనీ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న

జనసేన పార్టీ నాయకులు పులిరాజు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని భాస్కర్ రెడ్డి కాలనీలో జనసేన పార్టీ ఇంచార్జి మల్లప్పన్న ఆదేశాల మేరకు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాము. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రద్ధగా విన్నాము మరియు వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాము. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుంది. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందిప్రజల నమ్మకాన్ని ని లబెట్టుకుంటూ, వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ మీతోనే ఉంటామని భరోసా ఇస్తున్నాము.