మిడ్జిల్ మండల తహసిల్దార్ కి వినతిపత్రం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 08 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని టీఎస్ యుటిఎఫ్ మిడ్జిల్ మండలం కమిటీ1. రాష్ట్ర ప్రభుత్వం 2024సంవత్సరం , నవంబర్ నెలలో సమగ్ర కులగణన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో పాల్గొన్న సూపర్వైజర్స్ కు, ఎన్యూమరేటర్స్ కు సంబంధించిన గౌరవ పారితోషికం(రెమ్యూనరేషన్ )వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము . అదేవిధంగా 2) జనాభా గణన 2027లో భాగంగా మొదటివిడత లో మే-2026 న చేపట్టబోయే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ గణనలో మండలం ఉపాధ్యాయులందరికి విధులు కేటాయించ వలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ ఈ మండలంలో ఎక్కువైనచో… ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రక్క మండలంనకు విధులు కేటాయించవలసిందిగా కోరుచూ… మిడ్జిల్ మండల ఎంపీడీవో మేడం మరియు తాసిల్దార్కకి టీఎస్ టీఎస్ యుటిఎఫ్ మండలకమిటీపక్షాన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నర్సిములు , మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటయ్య , . రమేష్ కృష్ణ , పాషా పాల్గొన్నారు.