రాజాపూర్ ‘ఖేల్’ కు సర్వం సిద్ధం: 9న క్రీడా సమరం ప్రారంభం

★ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో " సంసద్ ఖేల్ " క్రీడా పోటీలు ★ క్రీడలు శారీరక ధృడత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి_ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి ★ క్రికెట్, కబడ్డీలో సత్తా చాటండి_బీజేపీ మండల అధ్యక్షులు కాటెపాగ ఆనంద్ ★ ఆట మీది గెలుపు మీది_బీజేపీ మండల ఉపాధ్యక్షులు పాలెం ప్రవీణ్ గౌడ్ ★ యువతకు స్వర్ణావకాశం ..సత్తా చాటండి_బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు పల్లె శేఖర్ ★ గ్రౌండ్‌లను పరిశీలించిన పార్లమెంట్ ఇంచార్జ్ ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి, సర్పంచ్ కావలి రామకృష్ణ , పలువురు ప్రముఖులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 08, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల కేంద్రం క్రీడా సంబరానికి వేదిక కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఈ నెల 9వ తేదీన ఘనంగా ప్రారంభం కానున్నాయని సంసద్ ఖేల్ పార్లమెంట్ ఇంచార్జ్ ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలకు సంబంధించి సోమవారం ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని వాలీబాల్, క్రికెట్ మైదానాలను , సర్పంచ్ కావలి రామకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు కాటెపాగ ఆనంద్,మండల ఉపాధ్యక్షులు పాలెం ప్రవీణ్ గౌడ్ , బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు పల్లె శేఖర్ , డబ్లు నరసింహ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధృడత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, 16 నుండి 45 ఏళ్ల లోపు వయస్సు గల ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, రన్నింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీలో సత్తా చాటండి, పరుగు తీయండి గెలుపు సాధించండి, ఇది యువతకు సువర్ణవకాశం అంటూ మండల యువతకు బీజేపీ మండల అధ్యక్షులు కాటెపాగ ఆనంద్, సర్పంచ్ కావలి రామకృష్ణ, పల్లె శేఖర్, ప్రవీణ్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ, మండల అధ్యక్షులు కాటేపాగ ఆనంద, జిల్లా సీనియర్ నాయకులు పల్లె శేఖర్, డబ్ల్యూ నర్సింలు, రాయపల్లి డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, వార్డ్ మెంబర్లు శివప్రసాద్ గౌడ్ , బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.