రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం అందించాలి

*జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భాజాప నాయకులు ధర్నా *జిల్లా కలెక్టర్ కు భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం వితరణ *ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా చేసి రైతులకు న్యాయం చేయాలి * బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి డిమాండ్ చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్ : సాలూరు మండలంలోని హున్సా ఖాజాపూర్ మందర్న గ్రామాల్లో శనివారం వడగళ్ల వాన కురిసిన నేపథ్యంలో పంటలు తీవ్రంగా నష్టపోయాయని మంగళవారం భాజపా నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో గురయ్యారు ఇప్పటికైనా అప్పుల బారిన పడిన రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోని నష్టపరిహారం చెల్లించాలని దినేష్ కులచారి డిమాండ్ చేశారు వర్షాకాలం సీజన్లో రైతులు నష్టపోయి ఉంటే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించలేదని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరుచుకొని రైతులను తక్షణమే ఆదుకోవాలని వరి మొక్కజొన్న అరటి నేలపాలై రైతన్నలు కన్నీటి గోసలు ప్రభుత్వాన్ని కనబడతలేవా ప్రభుత్వం రైతుల పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తుందని తక్షణమే నష్టపరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కు జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి వినతిపత్రం సమర్పించడం జరిగింది రైతులకు సరైన పరిహారం అందించకపోతే బిజెపి పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని రైతుల సమస్యల పరిష్కారం కోసం భాజపా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మండల అధ్యక్షులు రావుబా గంగాధర్ ఇంద్రకరణ్ సరీన్ సిర్ప సుదర్శన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల రామచందర్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *